Breaking News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

Published on Sat, 10/05/2024 - 05:05

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణం శాస్త్రోక్తం గా నిర్వహించారు. వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) సా. 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంలో అర్చకులు ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. 

ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా రామకృష్ణ దీక్షితులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు. 

ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. శనివారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. 

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం 
ఇక శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమర్పించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. 

అనంతరం.. ప్రభుత్వం తరఫున చంద్రబాబు పట్టువ్రస్తాలను తలపైన పెట్టుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు.

శ్రీవారి ఆలయంలో ఇష్టారాజ్యం.. 
మరోవైపు.. శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలు సమర్పించే సమయంలో సీఎంఓ సిబ్బంది, నాయకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనుమతిలేకపోయినా సుమారు 25 మంది వరకు ఆలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబుతో నాయకులు, అధికారులు యథేచ్ఛగా ఫోటోషూట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా డిక్లరేషన్‌లో సంతకం పెట్టకుండానే ఆలయంలోకి ప్రవేశించి స్వామి­వారిని దర్శించుకున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)