Breaking News

గూడుకట్టుకున్న నిర్లక్ష్యం

Published on Thu, 08/22/2024 - 05:04

విశాఖ సిటీ: పరిశ్రమల్లో నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మిక లోకానికి గుబులు పుట్టిస్తున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమా­ణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పా.. అధికార యంత్రాంగం పరిశ్రమలపై దృష్టిపెట్టిన సందర్భాలు ఉండడంలేదు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన భద్రతా ప్రమాణాలు ఇప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు పరిశ్రమల భద్రతపై ఒక్కసారి కూడా సమీక్షించిన సందర్భాల్లేవు.

20 పాయింట్‌ ఫార్ములా ఏమైంది?
2020, మేలో ఎల్‌జీ పాలీమర్స్‌ ఘటన తరువాత అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక నియమ, నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి అన్ని రకాల పరిశ్రమల్లో తనిఖీలు చేయించింది. ఇందులో ఉమ్మడి విశాఖలోని 121 పరిశ్రమల్లో లోపాలున్నట్లు గుర్తించింది. 

భద్రతా ప్రమాణాలు పాటించని ఆయా సంస్థలకు నోటీసులు జారీచేయ­డంతో పాటు 29 పరిశ్రమలపై కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితులు మరోసారి తలెత్తకుండా పరిశ్రమల్లో ప్రమాదాలను తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ‘20 పాయింట్‌ ఫార్ములా’ను అమలు­లోకి తీసుకొచ్చింది. అందులో ఉన్న అంశాలకు పాయింట్లు కేటాయించారు. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆ సంస్థ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిగణించాల్సి ఉంటుంది. 

కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు వరకు ప్రతి ఏడాది ఈ ఫార్ములా ప్రకారం అధికారులు తనిఖీలు నిర్వహించి పాయింట్లు కేటాయించారు. అయితే, ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ 20 పాయింట్‌ ఫార్ములాను పట్టించుకోలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)