Breaking News

అరుణ అసఫ్‌ అలీ.. ఇక సెలవ్‌!

Published on Mon, 07/20/2026 - 04:45

సాక్షి, విశాఖపట్నం: సముద్రపు అలల సాక్షిగా.. జాతికి అంకితమైన ఒక సుదీర్ఘ ప్రస్థానానికి సగౌరవ ముగింపు దక్కింది. భారత సాగర తీర భద్రతలో రెండు దశాబ్దాల పాటు అజేయ కవచంగా నిలిచిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక ‘ఐసీజీఎస్‌ అరుణ అసఫ్‌ అలీ’ శకం ముగిసింది. కల్లోల సాగరంలో రేయింబవళ్లు అలుపెరగకుండా గస్తీ కాస్తూ, దేశ సముద్ర సరిహద్దులకు నమ్మకమైన నిఘా నేత్రంలా సేవలందించిన ఈ నౌకకు రక్షణ దళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికింది. సైనిక లాంఛనాల మధ్య విశాఖలో జరిగిన ఈ డీకమిషనింగ్‌ వేడుకతో, సాగర రక్షణ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయానికి అధికారికంగా తెరపడింది.

తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్నం వేదికగా ఐసీజీ­ఎస్‌ అరుణ అసఫ్‌ అలీ  డీకమిషనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల తర­బడి సముద్ర జలాల్లో దేశానికి అలుపెరగని సేవలందించిన ఈ నౌకకు కోస్ట్‌గార్డ్‌ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కోస్ట్‌గార్డ్‌ డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విశాఖపట్నంలో కోస్ట్‌గార్డ్‌ కమాండర్‌ చిన్మయ్‌దాస్‌ మహాపాత్రా సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఈ నౌకను డీకమిషన్‌ చేశారు.

 సైనిక వందనాల మధ్య నౌక జెండాను దించి దాని సుదీర్ఘ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికారు. ఈ సందర్భంగా అధికారులు నౌక అందించిన అసా­ధారణ సేవలను కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక నౌకలో విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్క నావికుడికి, అధికారికి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సగర్వంగా సెల్యూ­ట్‌æ చేసింది. సముద్రపు కఠినమైన వాతావరణ పరి­స్థితులను సైతం లెక్కచేయకుండా, దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన ఆ సిబ్బంది నిబద్ధత భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని కితాబిచ్చింది.

2006 నుంచి సేవల ప్రస్థానం..
భారత సముద్ర సరిహద్దుల రక్షణలో ‘అరుణ అసఫ్‌ అలీ’ పాత్ర చిరస్మరణీయం. 2006లో కోస్ట్‌గార్డ్‌లో సేవలందించేందుకు ఈ నౌక చేరింది. భారత స్వా­తంత్య్ర సంగ్రామంలో అసాధారణ తెగువ చూపిన వీరనారి ‘అరుణ అసఫ్‌ అలీ’ గౌరవార్థం ఈ నౌకకు ఆమె పేరు పెట్టారు. సముద్ర జలాల పరిరక్షణ, అవాంఛనీయ కార్యకలాపాలను అరికట్టడం, తీర­ప్రాంత భద్రతను పటిష్టం చేయడంలో ఈ నౌక అత్యుత్తమ సేవలందించింది. దేశ సముద్ర రక్షణ వలయంలో ఒక బలమైన ఆయుధంగా ఏళ్ల తరబడి తన సత్తా చాటుకుంది. కార్యాచరణ నైపుణ్యానికి, దేశ రక్షణపట్ల నిరంతర అప్రమత్తతకు ఈ నౌక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. సముద్రంలో రేయింబవళ్లు కాపలా కాస్తూ, జాతికి ఒక నమ్మకమైన నిఘా నేత్రంలా, భద్రతా చిహ్నంగా ‘అరుణ అసఫ్‌ అలీ’ వ్యవహరించింది.

ఐసీజీఎస్‌ అరుణ అసఫ్‌ అలీ విశేషాలు..
నౌక క్లాస్‌: సరోజినీనాయుడు–క్లాస్‌ ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసల్‌
నిర్మాణం: గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌
సేవలు ప్రారంభం: 28 జనవరి 2006
నౌక పొడవు: 48 మీటర్లు
బరువు: 259 టన్నులు
గరిష్ట వేగం: గంటకు సుమారు 65 కిమీ
ప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 1,500 నాటికల్‌ మైళ్లు
ఆయుధ సంపత్తి: 30 ఎంఎం సీఆర్‌ఎన్‌ 91 నావల్‌ గన్, నౌకకు ఇరువైపులా రెండు 12.7 ఎంఎం హెవీ మెషిన్‌ గన్స్‌
సిబ్బంది: 35 మంది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)