Breaking News

ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్‌ రూ.11 లక్షల కోట్లు

Published on Mon, 04/21/2025 - 04:32

సాక్షి, అమరావతి: దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్ల అధిక వ్యయం జరుగుతోంది.  ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తున్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నాయి. ఔట్‌ఫిట్స్, ఫస్ట్‌లుక్, మెహందీ, హల్దీ, ఫొటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతోంది. 

ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్‌ విలువ రూ.11 లక్షల కోట్లుగా మార్కెట్‌ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘వెడ్డింగ్‌వైర్‌ ఇండియా’ సర్వే  వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఆకాశమంత పందిరి... భూదేవంత పీట
భారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి  ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం రూ.29.60 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందులో వివాహ వేదికకే 20 శాతానికిపైగా వెచ్చిస్తుండటం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున రూ.4.70 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.6 లక్షలకుపైగా కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఆ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉండడం విశేషం.  

తగ్గేదేలే..
భారతీయ వివాహ వేడుకలు కనీసం మూడు, నాలుగు రోజులు కొనసాగుతున్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణి గ్రామాల్లోకీ విస్తరిస్తోంది. అవసరమైతే అప్పుచేసి మరీ భారీగా శుభ కార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప, ఖర్చుకు వెనుకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది.

ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతున్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతున్నాయి. శుభ లేఖలూ ‘వైభవంగా’ ఉండాల్సిందే. అయితే  వివాహ ఆహ్వానాలు డిజిటల్‌ రూపంలోకి మారుతుండడం కొత్త ట్రెండ్‌.

రెండో అతిపెద్ద మార్కెట్‌
2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్‌ మార్కెట్‌లో వివాహ పరిశ్రమ  రూ.11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తరువాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కొన్ని కీలక విభాగాల మార్కెట్‌ విలువలు ఇలా...

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)