Breaking News

‘రక్షణ’ ఎగుమతుల్లో నంబర్‌ వన్‌ కానున్న భారత్‌..

Published on Mon, 08/05/2024 - 04:09

అవనిగడ్డ: రక్షణరంగ ఎగుమతుల్లో భారత్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగేరోజు దగ్గరలోనే ఉందని భారత రక్షణరంగ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఆదివారం దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు 99వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ చేతుల మీదుగా డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డికి అందజేశారు. 

ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ప్రతీదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని చెప్పారు. గత ఏడాది రూ.21 వేలకోట్ల విలువైన రక్షణరంగ పరికరాలను మనం విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మన దేశం రూ.50 వేలకోట్ల నుంచి రూ.80 వేలకోట్ల పరికరాలు ఎగుమతి చేసేస్థాయికి చేరుతుందన్నారు. 

మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చాయని చెప్పారు. నిమ్మకూరులో ఏర్పాటు చేసిన భెల్‌ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే­స్థాయికి చేరుకుంటామన్నారు. కృష్ణాజిల్లా నాగాయ­లంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలను తొలగించి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేస్తామని చెప్పారు. 

తెలుగువారిని ఒక్కటి చేసిన మండలి 
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సరసన చేర్చదగిన గొప్ప వ్యక్తి సతీష్‌రెడ్డి అని కొనియాడారు. తెలుగు భాషాభివృద్దికి తోడ్పడిన మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.  వెంకటకృష్ణారావు ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు ద్వారా తెలుగువారందరినీ ఒక్కటి చేశారని పేర్కొన్నారు. సతీష్‌రెడ్డి జీవితచరిత్రపై మండలి ఫౌండేషన్‌ ప్రచురించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)