Breaking News

చిన్న పెట్టుబడి.. పెద్ద రాబడి

Published on Sun, 12/01/2024 - 04:35

సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’ అనే పొదుపు పథకం విశేష ఆదరణ పొందుతోంది. మహిళలు, బాలికల కోసం ఈ పథకాన్ని 2023–24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు ప్రారంభించడానికి ఏప్రిల్‌ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు తమ పేరు మీద పోస్టాఫీసులు లేదా నిర్దేశించిన బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరవచ్చు. మైనర్‌ బాలికల పేరుతో సంరక్షకులు ఖాతా తెరిచే అవకాశం కల్పించారు.

కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా కల్పించారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం.

అందువల్ల దీనికి ఎలాంటి రిస్క్‌ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచారని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 7,46,223 ఖాతాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 2,11,016 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో నిలిచింది. ఈ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే  గడువు ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రూ.31,125 వడ్డీ..
ఈ పథకం కింద రూ.2,00,000 డిపాజిట్‌ చేస్తే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో రూ.15,000 వడ్డీ, రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రెండేళ్ల గడువు పూర్తయ్యేనాటికి వడ్డీతో కలిపి రూ. 2,31,125 మేర ప్రయోజనం పొందుతారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)