Breaking News

ప్రైవేట్‌ రాకెట్‌ యుగంలోకి భారత్‌

Published on Fri, 07/17/2026 - 05:06

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయంగా అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ ఈనెల 18న ఉదయం 11.30 గంటలకు  మొట్టమొదటి ప్రైవేట్‌ ఉపగ్రహ రాకెట్‌ విక్రమ్‌–1ను  ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇది ఇస్రో చరిత్రలో ఒక కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఇస్రోలోని వాణిజ్యపరమైన ఇన్‌–స్పేస్‌ సంస్థ వాణిజ్యపరమైన ప్రయోగాలను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది.  తిరుపతిజిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి విక్రమ్‌–1 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.  హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే సంస్థ  రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యులైన డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరుతో విక్రమ్‌–ఎస్‌ అని నామకరణం చేశారు. 

నాలుగు దశల్లో.. 
విక్రమ్‌–1 రాకెట్‌ను నాలుగు దశలతో రూపొందించారు.  మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో నాలుగో దశ ద్రవ ఇంధనంతో రూపొందించారు. మొదటి దశ కలాం–1200, రెండో దశ కలాం–250, మూడో దశ కలాం–100 లను ఘన ఇంధనంతో నిర్వహించనున్నారు.  నాలుగో దశలో మోనో మీథైల్‌ హైడ్రోజన్‌ (ఎంఎంహెచ్‌),  నైట్రోజన్‌ టెట్రాక్సైడ్‌ (ఎన్‌టీఓ) శక్తితో పనిచేసే రామన్‌–1 ఇంజిన్‌ల సమూహంతో పని చేస్తుంది.

ఇవి మొత్తంగా 3.4 కేఎన్‌ థ్రస్ట్‌ను అందిస్తాయి. వీటిలో ప్రతి దశ 80 సెకన్లనుంచి 100 సెకన్ల వరకూ మండుతుంది.  రామన్‌ ఇంజిన్‌లు కచ్చితమైన కక్ష్య ప్రవేశానికి, తుది కక్ష్య సర్దుబాట్లు కోసం రూపొందించారు.  దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ›ప్రింటెడ్‌ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లుతో పనిచేసే ఈ రాకెట్‌... 350 కిలోలు బరువు కలిగిన చిన్న తరహా ఉపగ్రహాలను 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది.

అంతరిక్షంలో వ్యర్థాల తొలగింపులో కీలక అడుగు
కాస్మోసర్వ్‌ స్పేస్‌ అనే స్టార్టప్‌ అంతరిక్ష సంస్థ  యాక్టివ్‌ డెబ్రిస్‌ రిమూవల్‌ (ఏడీఆర్‌) అభివృద్ధి చేసిన ‘మిషన్‌ ఎంబ్రేస్‌’ పేలోడ్‌ను విక్రమ్‌–1 ద్వారా ప్రయోగించనున్నారు.  మిషన్‌ ఆగమన్‌ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగం..  కక్ష్యలో సాఫ్ట్‌ రోబోటిక్‌ క్యాప్చర్‌ అనే సాంకేతికతను ప్రదర్శించే మొదటి పేలోడ్‌ కావడం విశేషం.  కక్ష్యలో పేరుకుపోతున్న క్రియారహిత ఉపగ్రహాలు, అంతరిక్ష శిథిలాలను తొలగించడం లక్ష్యంగా  ఈ పేలోడ్‌ను రూపొందించారు.  అంతరిక్ష శిథిలాలను తొలగింపునకు సంబంధించి విస్తృత  కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఒక చిన్న తరహా ఉపగ్రహం కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఏమిటీ ‘మిషన్‌ ఎంబ్రేస్‌’?
⇒ విక్రమ్‌–1 ద్వారా కక్ష్యలోకి వెళ్లనున్న ప్రత్యేక పేలోడ్‌
⇒ కాస్మోసర్వ్‌ స్పేస్‌ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత
⇒ అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను (స్పేస్‌ డెబ్రీస్‌) గుర్తించి తొలగించే లక్ష్యం

⇒ రోబోటిక్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని ప్రదర్శించనున్న తొలి భారతీయ పేలోడ్‌
⇒ పనిచేయని ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని కక్ష్య నుంచి తొలగించే సామర్థ్యం
⇒ భవిష్యత్‌లో అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ దిశగా కీలక అడుగు

విక్రమ్‌–1 విశేషాలు
తయారీ సంస్థ :     స్కైరూట్‌ ఏరోస్పేస్, హైదరాబాద్‌
ప్రయోగ స్థలం :     షార్, శ్రీహరికోట
ప్రయోగ తేదీ :     జూలై 18, ఉదయం 11.30 గంటలకు
రాకెట్‌ దశలు :     4

మొదటి మూడు దశలు : ఘన ఇంధనం
నాలుగో దశ :    ద్రవ ఇంధనం (రామన్‌–1 ఇంజిన్లు)
పేలోడ్‌ సామర్థ్యం :     350 కిలోలు
లక్ష్య కక్ష్య :     450 కి.మీ. ఎత్తులోనిలో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈఓ)
ప్రత్యేకత :     భారత్‌ నుంచి ప్రయోగిస్తున్న తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌

భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం
2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగం ద్వారాలను  ప్రైవేట్‌ సంస్థలకు తెరవడంతో భారతీయ స్టార్టప్‌లు రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో ముందుకొచ్చాయి.  ఆ సంస్కరణల ఫలితమే విక్రమ్‌–1 ప్రయోగం. ఇస్రో సహకారంతో ప్రైవేట్‌ సంస్థ స్వయంగా రూపొందించిన రాకెట్‌ను కక్ష్యలోకి పంపడం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక మైలురాయి, 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)