Breaking News

భక్తురాలి పట్ల అసభ్య ప్రవర్తన

Published on Wed, 09/24/2025 - 07:59

ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే. విశాఖపట్నంకు చెందిన ఒక భక్తుడి కుటుంబం (15 మంది) స్వామివారి దర్శనార్థం సోమవారం సాయంత్రం క్షేత్రానికి విచ్చేశారు.

శ్రీవారి దర్శనానంతరం వారు మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో స్థానిక టీటీడీ సదనం వద్దకు చేరుకుని గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నారాయణ వారితో కలివిడిగా మాట్లాడాడు. అదే సమయంలో బాధిత భక్తురాలు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత గదిలోంచి బయటకు వచ్చిన ఆమెను ఏమ్మా.. ట్యాబ్లెట్‌ వేసుకున్నావా అని ఆరా తీశాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున ఆమె కనబడగా ఏరా.. జ్వరం తగ్గిందా అని చేయి పట్టుకున్నాడు. 

దాంతో భక్తురాలి భర్త, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై నారాయణపై దాడి చేశారు. అనంతరం స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రంలో బాధిత భక్తురాలు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంటనే ఆలయ ఏఈఓ ఐనంపూడి రమణరాజు, సూపరింటెండెంట్‌ కోటగిరి కిషోర్‌ ప్రాథమిక విచారణ జరపగా, ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి నారాయణను ఉద్యోగం నుంచి తొలగించారు. కాగా సదరు ఉద్యోగి సుమారు పదేళ్ల నుంచి దేవస్థానంలో పనిచేస్తున్నాడని, ఇప్పటి వరకు అతడిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని, అందరితో కలివిడిగా ఉంటాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)