Breaking News

‘సెల్‌’.. కిల్‌ యూ

Published on Sun, 02/23/2025 - 05:02

సాక్షి, అమరావతి: ఇది డిజిటల్‌ యుగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సెల్‌ ఫోన్, ల్యాప్‌ టాప్, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌­తోనే పని. చదు­వులైనా, ఉద్యోగ­మైనా, వ్యా­పా­ర­మైనా, వస్తువులు కొన­డానికైనా అన్నిటికీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే ముఖ్య సాధనాలైపో­యాయి. అయితే వీటి వినియో­గం మితిమీరి వాటికి బానిస­లుగా మారిపోతున్న వారి సంఖ్య పెరిగిపో­తోంది. వీటి అతి వినియో­గం మనిషి మాన­సిక, శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభా­వం చూపుతోంది. 

ఎలక్ట్రా­నిక్‌ గాడ్జెట్స్‌ అతి వినియో­గాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరి­ణా­మాలు తలెత్తు­తా­యని వైద్యులు హెచ్చరి­స్తు­న్నారు. ఆరోగ్యం బాగు­ండాలి.. సంతోషంగా జీవించాలి.. అని దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంది ఉపవాసం పాటి­స్తుంటారు. అదేవి­ధ­ంగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వినియో­గాన్ని కొన్ని గంటలు, రోజులు వదిలేసి డిజిటల్‌ డిటాక్స్‌ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

డిజి­టల్‌ డిటాక్స్‌ విధానంతో మానసిక ఆరో­గ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుందని, శారీ­రక ఆరో­గ్యా­­నికి మేలు చేకూరుతుందని పరిశోధ­నలు వెల్లడి­స్తు­­న్నాయి. కెనడాలోని ఆల్బెర్టా విశ్వ­వి­ద్యాల­యం డిజి­టల్‌ డిటాక్స్‌పై అధ్యయనం చేయగా  ఆసక్తికర అంశాలు వెల్లడ­య్యా­యి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ను అతి­గా వినియో­గించే 467 మందిని ఈ విశ్వ­విద్యా­లయం పరిశోధ­కులు అధ్యయనం చేశారు. వీరికి రెండు వారా­ల పాటు సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేకుండా చేశారు. 

డిజిటల్‌ డిటా­క్స్‌కు ముందు, ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం, శ్రద్ధ, సామర్థ్యాలను అంచనా వేశా­రు. 91 శాతం మందిలో డిటాక్స్‌ అనంత­రం మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైంది. మొబైల్, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేని వ్యక్తులు ముఖా­ముఖి సంభాషణలు, వ్యా­యా­మం, చదవడం వంటి బహిరంగ కార్యక­లా­పాలను ఆస్వాదించడంలో నిమ­గ్న­మ­య్యారు. ఈ ప్రక్రియలు మాన­సిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మెదడుకు రీచార్జ్‌
భారతీయులు సగటున రోజుకు 7.3 గంటలు స్క్రీన్‌ చూడటానికి కేటాయిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గంటల తరబడి స్క్రీన్‌కు సమయాన్ని కేటాయించడంతో నిద్ర లేమి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ తలెత్తడంతో పాటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమ­స్యలు వస్తున్నాయి. ఈ చక్రాన్ని డిజిటల్‌ డిటాక్స్‌ విచ్ఛిన్నం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించి, రీఛార్జ్‌ అవుతుంది. 

స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్‌) దుష్ప్రభా­వాలు తగ్గిపోయి కంటికి మంచి నిద్ర దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహి­తులతో ముఖాముఖి చర్చించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడి, మనస్ప­ర్థలు తగ్గుతాయని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.

డీటాక్స్‌ సమయంలో రన్నింగ్, జాగింగ్, జిమ్‌లో వ్యాయా­మాలు చేయడం, ఇంటి, తోట పనులు వంటి శ్రమకు కేటాయించడంతో బీపీ, షుగర్‌ వంటి జీవన శైలి జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)