ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి

Published on Wed, 07/26/2023 - 04:39

సాక్షి,అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యా­మ్‌­లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారా­యణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది.

కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద  పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

కొద్ది రోజు­లుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నే­రు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నా­యి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్‌ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.  

సంగమేశ్వరుడి సన్నిధికి..

కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలా­లు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది.

Videos

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)