Breaking News

విద్యార్థి అనుమానాస్పద మృతి

Published on Mon, 02/16/2026 - 05:12

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు­లోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో శని­వా­రం రాత్రి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు.. కనిగిరికి చెందిన సయ్యద్‌ ఆలీ, భార్య మౌలాబికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు తౌషిక్‌(11) మూలగుంటపాడులోని శ్రీచైతన్య నవోదయలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వార్డెన్‌ బాబ్జి తరుచూ తౌషిక్‌ను కొడుతుండటంతో.. కరస్పాండెంట్‌ రమణారెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వార్డెన్‌ బాబ్జి సెల్‌ఫోన్‌ నుంచి తౌషిక్‌ తన తల్లి మౌలాబితో ఆనందంగా మాట్లాడాడు. ఆ తర్వాత అరగంటకే పాఠశాల నిర్వాహకుల నుంచి తౌషిక్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ వచి్చంది.

మీ కుమారుడు బాత్రూంలో టవల్‌తో ఉరేసుకున్నాడని.. కందుకూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేసి వెళ్లిపోయారంటూ తౌషిక్‌ తల్లిదండ్రులు విలపించారు. తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించినందుకు వార్డెన్‌ బాబ్జి కొట్టడంతో తౌషిక్‌ స్పృహ తప్పి పడిపోయాడని సహ విద్యార్థులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల నిర్వాహకులు మాత్రం తౌషిక్‌ బాత్రూంలోని హ్యాంగర్‌కు ఉరేసుకొని చనిపోయాడంటున్నారని వాపోయారు.

ఆ హ్యాంగర్‌ పిల్లల చేతికి అందే ఎత్తులో ఉందని.. దానికెలా ఉరేసుకొని చనిపోతాడంటూ వారు ప్రశి్నంచారు. గొంతుపై గాట్లు ఎందుకున్నాయని నిలదీశారు. తమ కుమారుడిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ఆలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం తౌషిక్‌ మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ధర్నా చేశారు. కరస్పాండెంట్‌ రమణారెడ్డి, ఆయన కుమారులిద్దరూ పరారయ్యారని తెలియడంతో.. పాఠశాలపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఎస్సై బి.మహేంద్ర పాఠశాల వద్దకు చేరుకొని.. వారికి నచ్చజెప్పి పంపించేశారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)