భార్యపై కోపంతో పిల్లలకు ఎలుకల మందు తాగించాడు

Published on Sun, 07/26/2026 - 06:26

ఒంగోలు టౌన్‌: భార్య, భర్తల మధ్య మనస్పర్థలు కన్నబిడ్డల ప్రాణాల మీదకు తెచ్చాయి. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన తండ్రి కన్నబిడ్డలకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించాడు. పరిస్థితి విషమించి కుమార్తె మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన కొరిశపాటి విజయకుమార్, ప్రవల్లిక 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కూతురు ఆద్య (10), కుమారుడు సుప్రీత్‌ (8) ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నారు. 

కొంతకాలంగా భార్య ప్రవల్లికపై అనుమానం పెంచుకున్న విజయకుమార్‌ ఆమెను వేధించసాగాడు. విసిగివేసారిన ప్రవల్లిక ఇంటినుంచి వెళ్లిపోయి ఒంగోలు శక్తిసదన్‌లో ఆశ్రయం పొందింది. నాలుగు నెలలుగా ఆమె అక్కడే ఉంటోంది. భార్య తన వద్దకు రాకపోవడంతో కక్ష పెంచుకున్న విజయకుమార్‌ ఈ నెల 19వ తేదీ ఆద్య, సుప్రీత్‌లకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించాడు. తరువాత ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకెళ్లి తల్లి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. మరుసటి రోజు పిల్లలు వాంతి చేసుకోవడంతో అనుమానం వచ్చిన ప్రవల్లిక ఏం జరిగిందని ఆరా తీసింది. 

నాన్న కూల్‌ డ్రింక్‌ తాగించినట్లు చెప్పారు. వాంతులు ఆగకపోవడంతో వెంటనే పిల్లలను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాయిజన్‌ తాగినట్లు నిర్ధారించారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం ప్రారంభించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో  మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె ఆద్య శనివారం మృతి చెందింది. కుమారుడు సుప్రీత్‌ ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే రెండు రోజుల కిత్రం తండ్రి విజయ్‌ కుమార్‌ కూడా ఎలుకల మందు తాగి ఆత్యహత్య ప్రయత్నం చేశాడు. అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అప్పుడు ఈ విషయం బయట పడింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)