Breaking News

బాలిక మానం విలువ రూ.లక్ష.. కామాంధుడికి పచ్చనేతల అండ!

Published on Thu, 01/22/2026 - 05:16

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ఓ బాలిక శీలానికి లక్ష రూపాయలు ఖరీదు కట్టిన సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురై తమను ఆశ్రయించిన బాలికకు అండగా నిలవాల్సిన పోలీసులు టీడీపీ నేతల పంచాయితీకి పూర్తి స్థాయిలో సహకారం అందించి కామాంధుడిని రక్షించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. 

విశ్వసనీయ సమాచారం మేరకు... చెన్నూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా తల్లితో కలిసి ఉంటోంది. అదే గ్రామంలో పని చేస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగి ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తర్వాత తరచూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ బాలికపై లైంగికంగా దాడి చేస్తున్నాడు. ఈ వేధింపులను భరించలేక సదరు బాలిక చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది.  

బలవంతంగా బాధితురాలిని ఒప్పించి...  
బాలిక పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగి తనను కేసు నుంచి రక్షించాలని కోరుతూ చెన్నూరు మండలానికి చెందిన టీడీపీ నేతలను ఆశ్రయించాడు. దీంతో సదరు టీడీపీ నేతలు కామాంధుడిని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ వేదికగా పంచాయితీ పెట్టారు. ‘‘అయిందేదో అయింది... కేసు పెడితే ఏం వస్తుంది... అతని నుంచి ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం...’’ అవి ఉపయోగపడతాయని బాధితురాలిని బలవంతంగా పంచాయితీకి ఒప్పించారు. 

ఈ క్రమంలో పంచాయితీకి సహకరించినందుకు పోలీసులకు రూ.50 వేలు, పంచాయతీ చేసిన టీడీపీ నేతలకు రూ.2 లక్షలను సదరు రెవెన్యూ ఉద్యోగి ముట్టచెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చే­సుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి బాలికకు న్యాయం చేయాల్సిన అవసరముంది. 

#

Tags : 1

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)