Breaking News

సీఐ వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యాయత్నం

Published on Tue, 09/02/2025 - 06:08

సాక్షి టాస్క్ ఫోర్స్‌: పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్‌నాయుడు సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నంచాడు. ఆ వీడియోలో ‘కొత్త­చెరువు సీఐ జి. మారుతీశంకర్‌ కేసుల పేరుతో వేధిస్తున్నాడు. రోజూ స్టేషన్‌కు రా­వాలని కబురు పంపిస్తున్నాడు. రౌడీïÙట్‌ తెరిచామని.. స్టేషన్‌కు సకాలంలో రాకుంటే మరిన్ని కేసులు నమోదుచేస్తామని బెదిరించారు.

అనవసరంగా నాపై కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నినట్లు అర్ధమవుతోంది. అందుకే సీఐ ద్వారా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకున్నా’.. అంటూ వివరించాడు. అనంతరం.. తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. స్థానికులు గమనించి అతనిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ నుంచి అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.

కూటమి నేతల ఒత్తిళ్లతో.. 
కొన్ని రోజులుగా కొత్తచెరువు మండలంలో అనేకమందిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదుచేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసుల పేరుతో వేధిస్తుండడంతో ఇప్పటికే బాధితులు కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. తప్పు ఎవరిదనే విషయంపై ఆరా తీయకుండా.. కూటమి నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)