Breaking News

శ్రీసిటీలో ‘కెర్రీ ఇండెవ్‌’ లాజిస్టిక్స్‌ కేంద్రం ప్రారంభం 

Published on Sat, 07/22/2023 - 05:48

సత్యవేడు (తిరుపతి జిల్లా):  భారత్‌లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్‌–3పీఎల్‌ (థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్‌ లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన  నూతన అత్యాధునిక లాజిస్టిక్స్‌ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ఇండియా ఆపరేషన్స్‌ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

కెర్రీ ఇండెవ్‌ చైర్మన్‌ డాక్టర్‌ గ్జావియర్‌ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్‌ హౌసింగ్, లాజిస్టిక్స్‌ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్‌ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్‌ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్‌ లాజిస్టిక్స్, ఇండోస్పేస్‌ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్‌హౌసింగ్‌ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ప్లానింగ్‌ హెడ్‌ గణపతి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)