Breaking News

మేడం వచ్చాకే రిబ్బన్‌ కటింగ్‌

Published on Fri, 07/12/2024 - 05:18

సాక్షి టాస్క్‌పోర్స్‌: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశా­ం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్‌ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్‌ కటింగ్‌ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్‌ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని విని­యోగదారులకు అందించేందుకు పౌర సరఫ­రాల శాఖ కడప రైతు బజార్‌లో ఓ స్టాల్‌ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఈ స్టాల్‌ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్‌ వస్తు­న్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్‌డీవో, డీఎస్‌వో­లతో పాటు మార్కెటింగ్‌ శాఖ అధికారు­లంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌­కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికా­రులు ప్రక­టి­ంచారు. ఇంతలోనే కడప నియోజక­వర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్ర­వేశం చేశా­రు. ఆయన కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రైతు బజార్‌­లో స్టాల్‌­ను ఓపెనింగ్‌ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నా­రని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్‌ స్టాల్‌ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. 

ఆ వెంటనే రైతు బజార్‌ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్‌ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్స­­వానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచా­రం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపె­నింగ్‌ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివే­యించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)