Breaking News

ఉత్తరాంధ్రకు వడగాడ్పుల ప్రభావం

Published on Sun, 04/20/2025 - 03:46

సాక్షి, విశాఖపట్న­ం: భానుడు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం చూప­ను­న్నాడు. ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 20న 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 19 మండలాల్లో వడగాడ్పులు, 21న 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 12 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయ­న్నారు. తీవ్ర వడగాడ్పుల ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉంటుందని తెలి­పారు. 

20వ తేదీన విజయనగరం జిల్లా­లోని 10 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లా­లోని 2 మండలాల్లో మాత్రమే ఆదివా­రం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 21న మన్యం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. 

దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజులపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వారం రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు క్రమ­ంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)