Breaking News

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన

Published on Sun, 05/07/2023 - 07:48

సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8వ తేదీకి ఇది అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం ఆగ్నేయ దిశగా కదిలి 9వ తేదీకి తుపానుగా మారి, ఉత్తర దిశగా మయన్మార్‌ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

అందువల్ల తుపాను ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అల్పపీడనం, వాయుగుండంగా ఉన్నంతవరకు కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా వుండగా తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 2, 3 రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు
శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో 6.4, ఏలూరు జిల్లా చాట్రాయిలో 5.9, బాపట్ల జిల్లా లోవలో 5, కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు గాయపడ్డారు. 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

తిరుమలలో భారీ వర్షం
తిరుమల: తిరుమలలో శనివా­రం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తిరుమలలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. శనివారం వర్షంతో భక్తులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు.

ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)