Breaking News

పైన స్టోన్‌ డస్ట్‌.. కింద ఇసుక

Published on Mon, 07/14/2025 - 05:41

నగరి: సినీఫక్కీలో స్టోన్‌ డస్ట్‌ ముసుగులో ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఆదివారం వేకువజామున నగరి పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు డ్రైవర్లను అరెస్ట్‌ చేశారు. నగరి సీఐ విక్రమ్, తహశీల్దార్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కొంతకాలంగా స్టోన్‌ డస్ట్‌ ముసు­గులో రాజంపేట నుంచి నగరి మీదుగా అక్రమంగా ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. 

ఆదివారం వేకువజామున నగరి–తిరుత్తణి మెయిన్‌ రోడ్డులో తమిళనాడు సరిహద్దు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. డస్ట్‌ స్టోన్‌ పేరుతో వెళుతున్న ఏడు టిప్పర్లను ఆపి తనిఖీలు చేశారు. టిప్పర్లలో 90 శాతం ఇసుక నింపి, దానిపై పది శాతం స్టోన్‌ డస్ట్‌ వేసి పట్టాలు కప్పినట్లు గుర్తించారు. 

ఏడు టిప్పర్లను సీజ్‌ చేశారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్లు వి.జయకృష్ణ(38), ఎస్‌.పాండియన్‌(42), ఎ.అజిత్‌కుమార్‌(29), ఎం.ప్రవీణ్‌కుమార్‌(28), ఏఎస్‌ శ్రీజిత్‌(26), ఎన్‌.అశోక్‌(31), నగరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామానికి చెందిన వి.దేవరాజులు(62)ను అరెస్టు చేశారు.  

చెన్నై నుంచి వచ్చి స్టోన్‌ క్వారీ లీజుకు తీసుకుని 
అరెస్ట్‌ చేసిన డ్రైవర్లను పోలీసులు విచారించగా, చెన్నై నుంచి భరత్‌ అనే వ్యక్తి నగరికి వచ్చి గుండ్రాజుకుప్పం వద్ద వేల్‌ అండ్‌ కో స్టోన్‌ క్వారీని లీజుకు తీసుకున్నాడని తెలిపారు. అతను తమిళనాడులోని కొంతమంది లారీ యజమానులను సిండికేట్‌ చేసి ఈ అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నాడని వివరించారు. తమిళనాడు నుంచి వచి్చన లారీలు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీచ్‌ నుంచి ఇసుక లోడ్‌ చేసుకుని నగరిలోని వేల్‌ అండ్‌ కో క్రషర్‌ వద్ద­కు వస్తాయని చెప్పారు. 

అక్కడ ఇసుకపై కొద్దిగా స్టోన్‌ డస్ట్‌ నింపి పరదాలు కట్టి తమిళనాడుకు పంపిస్తున్నారని తెలిపారు. స్టోన్‌ డస్ట్‌ తరలింపునకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు పే­ర్కొ­న్నారు. కాగా, అరెస్ట్‌ చేసిన ఏడుగురు డ్రైవర్లను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. క్రషర్‌ నిర్వాహకుడు భరత్‌ను, తెరవెనుక సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.  

అధికార పార్టీ నేతల అండతోనే?  
స్థానిక అధికార పార్టీ నేతల అండతోనే ఈ ఇసుక దందా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ లేకుండా రాజంపేట నుంచి నగరికి, అక్కడి నుంచి తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలించడం, భరత్‌ అనే వ్యక్తి చెన్నై నుంచి నగరి వచ్చి క్రషర్‌ లీజుకు తీసుకుని దర్జాగా ఈ దందా సాగించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)