Breaking News

ఇసుక దందా గుట్టురట్టు

Published on Fri, 06/14/2024 - 04:41

నరసన్నపేట: అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకులు మొదలుపెట్టిన ఇసుక దందా గుట్టు బట్టబయలైంది. అర్ధరాత్రి వేళ వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తుండగా సెబ్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. మడపాం, కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు బుచ్చిపేట వద్ద వంశధార నదిలో అక్రమంగా ఇసుక ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. 

లోడింగ్‌ పేరుతో ఒక్కో లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి దోచుకుంటున్నారు. ముందుగా ఇసుక లారీలను పగలంతా సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద ఉంచుతున్నారు. చీకటి పడగానే లారీలకు ప్రత్యేక రశీదులిచ్చి నదిలోకి పంపిస్తున్నారు. అడుగడునా టీడీపీ కార్యకర్తల ద్వారా నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు ఆ మార్గంలోకి వచ్చినా వెంటనే ఆ సమాచారం నదిలో ఉన్న వారికి వెళ్లిపోతోంది. వారు వెంటనే అప్రమత్తమై లారీలను సమీపంలోని జీడి తోటల్లోకి తరలిస్తున్నారు. 

ఈ విషయం తెలియడంతో సెబ్‌ అధికారులు బుధవారం రాత్రి బుచ్చిపేటకు వచ్చి మాటు వేశారు. నదిలో 20కి పైగా లారీల్లో ఇసుక లోడింగ్‌ చేస్తుండగా.. సెబ్‌ అధికారులు దాడి చేశారు. మొత్తం 14 లారీలు దొరకగా.. మిగిలిన లారీలు సమీప జీడి తోటల్లోకి వెళ్లి తప్పించుకున్నాయి. ఈ దోపిడీపై సీఐ సతీశ్‌ కుమార్, ఎస్‌ఐ కావ్య కేసు నమోదు చేశారు. సీజ్‌ చేసిన లారీలను నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. 

కాగా, ఇసుక దందాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల స్వార్థం వల్ల ఊరంతా ఇబ్బంది పడుతోందని స్థానికులు చెప్పారు. ఇసుక దందాలను అడ్డుకోవాలని కోరారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)