Breaking News

‘దేవర తిప్ప’పై అక్రమార్కుల తిష్ట

Published on Tue, 12/24/2024 - 04:36

సైదాపురం: విలువైన ఖనిజ నిక్షేపాలున్న  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దేవరతిప్ప కొండపై అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు తిష్ట వేశారు. సైదాపురం తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోనే ఉన్న ఈ కొండలో అపారమైన స్పోక్‌ క్వార్ట్‌ ్జ ఖనిజం దొరుకుతుంది. దీంతో కూటమి నేతలు ఈ కొండను చెరబట్టారు. వారి అండతో ఓ చోటా వ్యాపారి విలువైన ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. పట్ట పగలే భారీ సంఖ్యలో కూలీలను పెట్టి యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఈ విషయం తెలిసినా మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దేవరతిప్ప వద్ద 24 రకాల ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.

దేశంలో భూగర్భ పరిశోధన చేసే విద్యార్థులు  ఏటా ఈ కొండను సందర్శించి, ఇక్కడి ఖనిజాలపై పరిశోధనలు చేస్తుంటారు. గతంలో టీడీపీ హయాంలో ఈ కొండలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత గనులన్నీ మూతపడిపోవడంతో  కొండ జోలికి రాలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో స్పోక్‌ క్వార్ట్‌ ్జ ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. యంత్రాలతో త  వి్వతే అనుమానాలు వస్తాయన్న కారణంతో ఇతర ప్రాంతాల నుంచి తెచి్చన కూలీలతో తవ్వుతున్నారు.

తట్టకు రూ.150 వంతున కూలీలకు చెల్లిస్తున్నారు. 400 తట్టలు ఏరితే 10 టన్నులు వస్తోంది. స్థానికంగానే 10 టన్నుల ఖనిజానికి రూ. లక్ష ధర పలుకుతోంది. ఈవిషయం జిల్లా మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఫలితం లేకపోయిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)