Breaking News

రాత్రికి రాత్రే రూ.12కోట్ల బెరైటీస్‌ లూటీ

Published on Thu, 01/16/2025 - 05:32

సాక్షి ప్రతినిధి, కడప : అందరూ సంక్రాంతి సంబరాల్లో జోరుగా హుషారుగా మునిగితేలుతుంటే తెలుగుదేశం తమ్ముళ్లు ఇదే అదనుగా దోపిడీకి తెగబడ్డారు. సందట్లో సడేమియాలా రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారు. వెలికితీసి నిల్వ ఉంచిన బెరైటీస్‌ను లూటీ చేసేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మైనింగ్‌ లీజుదారులు అధికారులకు విన్నవించినా ఉపయోగంలేకుండా పోయింది.

వైఎస్సార్‌ జిల్లా వేముల మండల కేంద్రంలో పులివెందుల టీడీపీ తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఈ దోపిడీకి బరితెగించారు. వివరాలివీ..వేముల గనుల్లో వెలికితీసిన బెరైటీస్‌ ఖనిజాన్ని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో టిఫిన్‌ బెరైటీస్‌ ఆస్‌బెస్టాస్‌ ప్రైవేట్‌ లిమి­టెడ్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రాంగణంలో దాదాపు 3,500 టన్నులు నిల్వలు అధికారికంగా ఉన్నాయి. ఈ స్టాకుపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. 

అక్రమ మైనింగ్‌ చేస్తే కొంతమేరే అక్రమ ఆదాయం వస్తుంది.. అదే రాత్రికి రాత్రే నిల్వ ఉన్న ఈ ఖనిజాన్ని కొల్లగొడితే దెబ్బకు ఒకేసారి భారీగా లబ్ధిపొందవచ్చని వారు భావించారు. అంతే..  సుమారు 3వేల టన్నుల బెరైటీస్‌ను ఉన్నపళంగా తరలించేశారు. మరోవైపు.. తెలుగుదేశం నేతలు తమ కంపెనీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబా­ట్లకు పాల్పడుతున్నారని.. పైగా అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్న­వించినా నిరుపయోగమే అయ్యిందని ఆ సంస్థ ప్రతి­నిధి వాపోయారు.

 సుమారు రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని 20 లారీల ద్వారా తెల్లవారేలోపే వివిధ ప్రాంతాలకు తరలించేశారని.. వారి పన్నాగాన్ని పసిగట్టి అటు మైనింగ్‌ అధికారులకు ఇటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో లూటీకి ఆస్కారం ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.

బీటెక్‌ రవి ప్రోద్బలంతోనే..
ఇదిలా ఉంటే.. టిఫిన్‌ కంపెనీకి చెందిన దాదాపు 3 వేల టన్నుల బెరైటీస్‌ను అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోవడం వెనుక పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి ఉన్నారని.. ఆయన ప్రోద్బలంవల్లే ఇది సాధ్య­మైందని ఆ కంపెనీ ఏజెంట్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము) మీడియాకు వెల్లడించారు.

అలాగే, వేముల మండల టీడీపీ నేతలు పార్థసా­రథిరెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథ్‌­రెడ్డిల ప్రత్యక్ష ప్రమేయంతో పెద్దపెద్ద యంత్రాల ద్వారా లోడింగ్‌ చేస్తూ దాదాపు 20 లారీల బెరైటీస్‌ను తెల్లవారేలోపు కడపలోని పవన్, డైమండ్, జకరయ్య మినరల్స్‌కు తరలించారన్నారు. మరికొంత స్టాకు వేములలోని రామిరెడ్డితోటకు, పేర్ల పార్థ­సారథిరెడ్డి ఇంటి దగ్గర నిల్వ ఉంచారని తెలిపారు. 

నిజానికి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీ ప్రతినిధిని అయిన తనను అనేక విధాలుగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని.. కుదరకపోవడంతో చివ­రికి హత్యాయత్నానికి కూడా తెగబడ్డా­రన్నారు. వారి బెదిరింపులకు భయపడకుండా వీరి గురించి అధికారులతో పాటు చివరికి ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు సైతం స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసిన ఈ స్టాకుపైన హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులున్నా టీడీపీ నేతలు కొల్లగొట్టుకుపోయారని వారికి తెలిపా­నన్నారు. 

అవసరమైతే పోలీసు పికెట్‌ ఏర్పాటుచేయాలని డీఎస్పీ, ఎస్‌ఐలను  ఆదేశించారనన్నారు. అయినా.. సంక్రాంతి రోజున రాత్రికి రాత్రే మాయంచేశారని వేల్పుల రామలింగారెడ్డి వాపోయారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు