Breaking News

న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం

Published on Tue, 07/30/2024 - 05:05

విజయవాడస్పోర్ట్స్‌: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన దాడి ఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను నిందితుడుగా చేర్చడాన్ని బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) న్యాయవాదులు తప్పుబట్టారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ దాడి ఘటనలో న్యాయవాదులను ఇరికించేందుకు మంగళగిరి రూరల్‌ పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్‌ తరుఫున న్యాయస్థానానికి వాదనలు వినిపించేందుకు వెళ్లిన గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 

పోలీసుల తీరును ఖండిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించి గవాస్కర్‌కు సంఘీభావంగా విజయవాడ సివిల్‌ కోర్టుల ప్రాంగణం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి మాట్లాడుతూ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, అప్పట్లోనే పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే పలువురు నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్న గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి 88వ నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశి్నంచారు. 

సీనియర్‌ న్యాయవాది గౌతంరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది గవాస్కర్‌ మాట్లాడుతూ ఈ కేసులో తన పేరు ఉందని వారం కిందటి వరకు తనకు తెలీదన్నారు. నాలుగు రోజుల క్రితం కోర్టుకు వెళితే హత్యాయత్నం కేసులో నిందితుడిగా తన పేరును పోలీసులు చేర్చడంతో ఒక్క సారిగా ఖంగుతిన్నట్టు చెప్పారు. 

ఇదేంటని ప్రశి్నస్తే.. పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఫ్లకార్డులను ప్రదర్శించారు.  ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు మన్మథరావు, నిర్మల్‌రాజేష్, కోటంరాజు, బసవరెడ్డి, సాయిరామ్, ఆదాం, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)