Breaking News

రాజధానిలో దళితులపై ‘సీఆర్డీయే’ దాష్టీకం!

Published on Sat, 11/16/2024 - 04:40

తాడికొండ:  కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్‌గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్‌ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్‌తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు. 

ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్‌కు ఇచ్చి రిటర్న్‌బుల్‌ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది  ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. 

ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్‌ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్‌ కమిషనర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు. 

పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)