Breaking News

‘సాక్షి’ విలేకరి అక్రమ అరెస్టు

Published on Thu, 07/31/2025 - 05:25

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల పోలీసులు ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేసి ఆయనను బుధవారం జైలుకు పంపారు. దీనిపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విలేకరిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణం ఎత్తేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ వి.రత్నను కలిసేందుకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు తదితరులు వెళ్లగా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ ఆదినా­రాయణకు వినతిపత్రం అందజేశారు. 

పాత్రికేయులపై ఇలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం మంచిది కాదని పోలీసుల తీరును, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామికి సైతం స్థానిక విలేకరులు వినతిపత్రం అందజేశారు. సాక్షి విలేకరిపై పెట్టిన కేసును సమగ్రంగా విచారించి తగు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రఘునాథ్‌రెడ్డిపై అక్రమ కేసు ఎత్తివేయాలని  కోరుతూ హిందూపురం ప్రెస్‌క్లబ్‌ సభ్యులు వన్‌టౌన్‌ సీఐ రాజగోపాల్‌ నాయుడుకు వినతిపత్రం అందించారు. ఏపీయూడబ్ల్యూజే తాడిమర్రి మండల కమిటీ సభ్యులు ఏఎస్‌ఐ సూర్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. తప్పుడు కేసు ఎత్తేయాలంటూ జిల్లాలో పలుచోట్ల పాత్రికేయులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

టీడీపీ నేతల ఒత్తిడితోనే.. 
తలుపుల మండల టీడీపీ కార్యకర్త నవీన్‌ ఈ నెల 28న పట్టపగలు రాజనోళ్లపల్లి సర్పంచ్‌ సుగుణమ్మ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. నైలాన్‌ తాడుతో ఆమె గొంతు బిగించి చంపాలని కూడా చూశాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో తాను దొంగ అనే విషయం ఊరందరికీ తెలిసిపోయిందనే భావనతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలు సుగుణమ్మతో పాటు మరో ఏడుగురిపై హత్య కేసు పెట్టారు. ఈ కేసులో ఆ మండల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డిని కూడా ఏ–2 నిందితుడిగా చేర్చి రిమాండ్‌కు తరలించారు. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)