Breaking News

ఉరేసుకుని ఐఏఎస్‌ కుమార్తె ఆత్మహత్య

Published on Tue, 12/02/2025 - 05:12

తాడేపల్లి రూరల్‌/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్‌ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్‌ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్‌స్టాగ్రామ్‌­లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్‌ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్‌ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసు­కొచ్చామని చెప్పారు. తమ కుమార్తె

మృతికి కారణమైన 
రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్‌ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.

తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)