Vizag: సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటున్నామని..

Published on Tue, 03/28/2023 - 14:56

సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వీడియోను కొడుక్కి పంపి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక వడ్లపూడి  తిరుమల నగర్‌లో చిత్రాడ వరప్రసాద్‌(47), మీరా(41) దంపతులు నివాసముంటున్నారు.వర ప్రసాద్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు  భార్య మీరాతో కలిసి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘నా కూతురు, కొడుకును జాగ్రత్తగా చూసుకోండి.. మా అత్తను, అమ్మను మంచిగా చూసుకోండి. నా కూతురు అమాయకురాలు. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని తనను ఏం అనకండి. లక్ష్మి, తమ్ముడు జాగ్రత్త. మామయ్య వాళ్లందరూ ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకుంటారు. ఏవరూ ఏమన్నా పట్టించుకోండి. ఇక మేం వెళ్లిపోతున్నాం’ అంటూ కంటతడిపెట్టుకున్నారు. 

ఈ వీడియోను తమ కుమారుడు కృష్ణ సాయితేజకు పంపించి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణ సాయితేజ  దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)