Breaking News

అల్లుడు కాదమ్మో యముడు

Published on Tue, 11/11/2025 - 09:31

పశ్చిమ గోదావరి జిల్లా: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను, అడ్డు వచ్చిన మామ, బావమరిదిని నరికిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొల్లలకోడేరు శివారు తుమ్మలగుంట పాలెంకు చెందిన కడలి సత్యనారాయణ తన కూతురు శ్రీలక్ష్మిని 17 ఏళ్ల క్రితం అత్తిలి మండలం మంచిలికి చెందిన వీరవల్లి రామచంద్రరావు అలియాస్‌ చందుకు ఇచ్చి పెళ్లి చేశారు. చందు తరచూ ఖతర్‌ వెళ్ళి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు సార్లు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకున్నారు. 

మూడేళ్ల నుంచి తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. కూతురు మహేశ్వరికి కత్తి చూపి మీ అమ్మను చంపేస్తాను అని బెదిరించేవాడు. ఆ విషయం తాత సత్యనారాయణకు చెప్పింది. భయపడ్డ అతను శీలక్ష్మని తన ఇంటికి తీసుకొచ్చాడు. పాలకోడేరు, అత్తిలి పోలీసులు చందుకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ నెల 9న రాత్రి చందు కత్తితో వచ్చి బయట ఉన్న శ్రీలక్ష్మీ భుజంపై నరికాడు. అడ్డు వచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్‌ ను కూడా నరికాడు. చుట్టుపక్కల వారు వచ్చి ముగ్గురిని భీమవరం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై రవివర్మ తెలిపారు. మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    

#

Tags : 1

Videos

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

బాబూ... అప్పుడే ఎందుకు భయపడుతున్నావ్..? అతి దగ్గరలోనే!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)