Breaking News

ఈ వయసులో నీకిది అవసరమా..!

Published on Sat, 09/06/2025 - 14:04

అమలాపురం రూరల్‌:  భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్‌ స్క్వాడ్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది.

 ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు. 

ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్‌ కుమార్, ఎస్సై శేఖర్‌ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్కవనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్‌ బాబు తెలిపారు.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు