Breaking News

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త

Published on Thu, 05/01/2025 - 11:12

గుడివాడరూరల్‌: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్‌ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. 

ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్‌ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్‌ పరారయ్యాడు.

 గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.  భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్‌ వినీల్, స్థానిక పోలీస్‌ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్‌ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)