Breaking News

అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త

Published on Sat, 06/08/2024 - 12:30

చినగంజాం: భార్యను అనుమానించిన ఓ భర్త.. ఆమెను కత్తితో మెడపై నరికి చంపిన సం«ఘటన బాపట్ల జిల్లా చినగంజాం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చినగంజాం పంచాయతీ మహాలక్ష్మీకాలనీకి చెందిన కత్తి దుర్గ (30)ను భర్త కత్తి శ్రీను దారుణంగా కత్తితో దాడి చేసి మెడపై నరికి చంపాడు. వీరికి 15 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా మహాలక్ష్మీకాలనీలో కాపురం ఉంటున్నారు. భార్య దుర్గ కొద్ది రోజులుగా తరచూ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానంతో గొడవలు జరుగుతున్నాయి. 

భర్త వేధింపులు తట్టుకోలేని భార్య దుర్గ.. అదే కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు నెల రోజుల కిందట తన తొమ్మిదేళ్ల రెండో కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం భర్త కత్తి శ్రీను తన అత్తమామలు ఇంట్లో లేనివేళ వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ వాదులాడుకుంటుండగా, ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం కత్తితో ఆమె మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమార్తె పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి స్థానికులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి వెళ్లిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు చేరుకునే సరికే దుర్గ మృతి చెంది ఉంది. ఆమె భర్త శ్రీను పరారీలో ఉన్నాడు.  

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్‌ఐ... 
సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ బీ శ్రీనివాసరావు, చినగంజాం ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి శవ పంచనామా నిర్వహించారు. దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కత్తి శ్రీనును పట్టుకుంటామని చెప్పారు.

మేం ఇంట్లో లేని సమయంలో మా కుమార్తెను చంపాడు... 
తాము ఇంట్లో లేకుండా వేటకు వెళ్లిన సమయంలో వచ్చిన తమ అల్లుడు శ్రీను తమ కుమార్డె దుర్గను కత్తితో దారుణంగా నరికి చంపాడని దుర్గ తల్లిదండ్రులు ఎం.అంజయ్య, రాగమ్మ పోలీసులకు తెలిపారు. పెళ్లయిన దగ్గర నుంచి తమ కుమార్తెను తరచూ వేధింపులకు గురిచేసేవాడని చెప్పారు. ఆమెకు ముగ్గురు బిడ్డలున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)