Breaking News

భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

Published on Sun, 07/20/2025 - 07:37

చంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్‌(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెక్నీషియన్‌ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. 

భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా,  ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్‌ వద్ద లోకేశ్వర్‌ కాపు కాశాడు. 

బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్‌ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్‌ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్‌ కోసం అతని ఇంటికి వెళ్లగా..  అప్పటికే ఇంట్లో లోకేశ్వర్‌ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)