Breaking News

హైకోర్టు కారుణ్యం

Published on Sat, 11/08/2025 - 04:37

సాక్షి, అమరావతి: రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని సీఆర్‌డీఏ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ, అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ, మతిస్థిమితం లేని మనుమరాలు  శ్యామల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది. 

తమ నుంచి తీసుకున్న 5 సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సీఆర్‌డీఏ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శేషగిరమ్మ, ఆమె మనుమరాలు విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. తమ బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్‌టేకర్‌ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, లేని పక్షంలో తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ 90 ఏళ్ల ఆ వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనుమరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అవ్వ, మనుమరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు.  

అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్‌నిచ్చి రూపేష్‌ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు, ఆమె మనుమరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించారు. చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)