Breaking News

డీఎస్సీకి 5.67 లక్షల దరఖాస్తులు

Published on Fri, 05/16/2025 - 05:05

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ–2025కి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో 20వేల వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ–2025 పేరుతో 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఏప్రిల్‌ 20 నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. 

నోటిఫికేషన్‌లో ఊహించని కఠిన నిబంధనలు విధించింది. దీంతో దాదాపు 7లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ... రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40శాతానికి తగ్గించి, టెట్‌లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది.

 అయితే, ఇదే టెట్‌లో జనరల్‌ అభ్యర్థులకు 45శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ గెజిట్‌కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

సీబీఎస్‌ఈ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ, టెట్‌ పూర్తి చేసినవారికీ కూటమి ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు పదో తరగతిలో మొదటి భాష ఇంగ్లిష్‌ ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్‌జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోయారు. 

2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సీబీ­ఎస్‌ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగా డీఎస్సీ–2025కి వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. అయితే, మొదటి లాంగ్వేజ్‌గా తెలుగు కచ్చితమనే నిబంధన పెట్టడంతో 15వేల నుంచి 20వేల మంది అర్హులైన అభ్యర్థులు అనర్హులుగా మారారు.  

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)