Breaking News

ఎలక్ట్రానిక్‌ రంగంలో భారీ పెట్టుబడులు

Published on Sat, 03/11/2023 - 03:57

సాక్షి, అమరావతి :  ఎల్రక్టానిక్స్‌ అండ్‌ డిజైనింగ్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా ఎల్రక్టానిక్స్‌ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ వెల్లడించారు.

ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనే వచ్చాయి.  

అత్యధికంగా టీసీఎల్‌ గ్రూప్‌.. 
టీసీఎల్‌ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్‌ప్లే ప్యానల్స్‌ను 
టీసీఎల్‌ గ్రూపు ఉత్పత్తి చేయనుంది.  
సెల్‌ఫోన్‌ కెమెరాలు, ఇయర్‌ ఫోన్స్‌ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్‌ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.  
 అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్‌ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాల­ను ప్రకటించాయి. డైకిన్‌ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టు­బడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్‌ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.  
  ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్‌ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్య­వ­సాయ రంగాల్లో ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులను తయారు­చేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తు­తం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపి­టా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరు­పతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్‌ జిల్లా కొప్ప­ర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టా­నిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్‌ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్‌ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పె­ట్టు­బడులు పెట్టడానికి  ముందుకొస్తున్నట్లు తెలిపారు.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)