Breaking News

మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం

Published on Mon, 04/29/2024 - 05:54

 సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్‌ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. 

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు.

 డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. 

అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాల­నలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుం­బసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశా­రు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావు­­లేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరు­లు, కాపు సోదరిలకు సీఎం జగన్‌ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవా­లంటే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)