Breaking News

సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే..?

Published on Sun, 04/14/2024 - 11:33

సాక్షి, విజయవాడ: జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎంకు బలమైన గాయం కావడంతో రక్తం ధారగా కారింది.. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్‌ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత యాత్ర సీఎం జగన్‌ కొనసాగించారు. దాడి తర్వాత మరో 20 కి.మీ వరుకు బస్సు యాత్ర కొనసాగించారు. అసలు సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే..

యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్‌ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. 

8:10 PM: విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై రాళ్ల దాడి

8:30 PM: బస్సులోనే సీఎంకు ప్రథమ చికిత్స

8:50 PM దాడి తర్వాత తిరిగి జగన్‌ బస్సు యాత్ర

10:00 PM: బస్సు నుంచే జనానికి సీఎం జగన్‌ అభివాదం

10.30 PM: కేసరపల్లి క్యాంప్‌నకు చేరుకున్న సీఎం జగన్‌
 

11:15: కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి

11.30 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

అర్ధరాత్రి 12:10 AM: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

అర్ధరాత్రి 12.20 ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్‌నకు తిరుగు ప్రయాణం

 

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ కు, గంగానమ్మ గుడికి మధ్య నుండి  రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం.. మరో వైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ లోని కొన్ని కిటికీలు తెరుచుకుని ఉన్నాయి. వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్‌తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం. దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్‌కి గుడికి మధ్య నుంచి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం. పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం. కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్‌ని టీడీపీ గుండాలు టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)