Breaking News

దొరా.. ఇళ్లు రెడీ!

Published on Thu, 11/07/2024 - 08:50

కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ(ఎన్‌సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న  ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.

సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించాన‌లి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్‌సీసీ ముందుకొచ్చింది.  గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యల‌క్ష్మమ్మ‌, ఐటీడీఏ పీవో అభిషేక్  గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది.  

ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు...  
ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్‌సీసీ నిర్మించింది.  ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్‌ రూమ్‌లు, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మ‌ల్లుదొర‌ , గంటందొర వా­రసులు 11 మందికి 11 ఫా­్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్‌సీసీ తమ కార్యకలాపాల కోసం వినియో­గించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సే­వా సమితి పర్యవేక్షిస్తోంది.    

ఆనందంగా ఉంది 
ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు.  – గాం గంగరాజు, లంకవీధి

సొంతిల్లు అదృష్టం 
ఎట్టకేలకు సొంత గూటికి చేరు­తున్నామన్న ఆ­నందంలో ఉ­న్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలే­దు. రెండు బెడ్‌ రూమ్‌లతోపాటు హాలు, కి­చెన్, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లు నిర్మించ‌డం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధి

సమస్యను పరిష్కరించాం 
ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించ‌డం మరిచిపోలేని విషయం. ల‌బ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)