Breaking News

రోడ్డెక్కిన రైతన్నలు

Published on Wed, 09/03/2025 - 04:25

సాక్షి, అమరావతి/ఉదయగిరి రూరల్‌/గంగవరం/సదుం/మదనపల్లె రూరల్‌: రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానపల్లె పంచాయతీ బిజ్జంపల్లిలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డుపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం, సదుం మండలాల్లో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. 

గంగవరంలోని పీఏసీఎస్‌ కార్యాలయానికి చేరిన 450 బస్తాలు యూరియా కోసం 2వేలమందికిపైగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు గాశారు. దీంతో ఉన్న 450 బస్తాలను ఇంతమందికి ఎలా పంచాలా అని అధికారులు తలలు పట్టుకున్నారు. పీఏసీఎస్‌ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ రైతులు ఎండలో క్యూకట్టారు.  వీరిలో వృద్దులు, మహిళలూ ఉన్నారు. అలాగే, సదుంలోని ఓ ప్రైవేటు దుకాణానికి 14 క్వింటాళ్ల యూరియా రావడంతో అక్కడ కూడా రైతులు బారులు తీరారు. 

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మండల వ్యవసాయశాఖాధికారి(ఏవో) కార్యాలయంలో యూరియా కూపన్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. కూపన్లు ఇస్తున్న క్రమంలో అక్కడ  తోపులాటలు, అరుపులు, కేకలతో పరిస్థితి గందరగోళంగా మారింది. గంటలసేపు నిల్చుని, తోపులాటకు గురై ఇబ్బందులు పడుతూ లోనికి వెళితే ఒకరికి ఒక బస్తా యూరియానే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం 
ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల డిమాండ్‌కు సరిపడా యూరియా అందించడంలో ప్రభు­త్వం పూర్తిగా విఫలమైందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు 22.12 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, దాంట్లో సగానికి పైగా వరి సాగైందని చెప్పారు. అదునుకు పంటకు యూరియా అందించకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెపె్టంబర్‌లో వరి చిరుపొట్టదశలో తప్పనిసరిగా యూరియా వేయాలని, దీనికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. 

సీజన్‌ ప్రారంభంలోనే వరి సాగు ఏరియాలో యూరియా కొరత వచ్చిందని, ఆగస్ట్‌ 8 నుంచి కురిసిన అధిక వర్షాలతో ముంపునకు గురైన వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకూ యూరియా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ సరిపడా యూరియాను ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా యూరియా కోసం రైతులు బారులు తీరి కన్పిస్తున్నారన్నారు.

రెండో పంటకు యూరియా కొనవద్దని ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. రూ.266.5 ఉన్న యూరియా కట్టను కొనాలంటే ప్రైవేటు వ్యాపారులు రూ.1,400పైగా ఉన్న కాంప్లెక్స్‌ కట్ట లేదా రూ.800– 900 పలికే పురుగు మందును బలవంతంగా అంటకడుతున్నారని నాగిరెడ్డి చెప్పారు. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)