Breaking News

పరువుగల కుటుంబాలు అత్యాచార కేసులు పెట్టడం లేదు!

Published on Wed, 10/16/2024 - 03:58

సాక్షి, అమరావతి: ‘మీకు తెలుసు కదా పెద్ద పెద్ద కుటుంబాలు, పరువుగల కుటుంబాల్లో అత్యాచా­రాలు జరిగినా కేసులు పెట్టడం లేదు. కేసులు నమో­దుకాని అత్యాచారాలు ఎక్కువే జరుగుతు­న్నాయి’అని రాష్ట్ర హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వెలగపూడి­లోని సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్ప­డే­వారిని గుర్తించి కచ్చితంగా శిక్షిస్తామన్నారు. 

శ్రీసత్యసాయి జిల్లాలో అత్తా­కో­డళ్లపై అత్యాచారం దురదృష్టకర ఘటనగా పేర్కొ­న్నారు. అత్యా­చా­రానికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. వారిలో మైనర్లు  ఉన్నారని చెప్పారు. అత్యాచార కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాయనుందని మంత్రి అనిత చెప్పారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసు శాఖతో అనుసంధానిస్తే నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. 

ఇవేం వ్యాఖ్యలు మంత్రిగారూ.. 
అత్యాచారాలపై హోమ్‌ మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బాధితులను విస్మయానికి గురి చేశాయి. ‘అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న అత్యాచార బాధితులంతా పరువులేని కుటుంబాలకు చెందినవారా’అని పరిశీలకులు మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అత్యాచార బాధి­తులపై సానుభూతి చూపాల్సిన మంత్రి అనిత అందుకు విరుద్ధంగా వారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం విభ్రాంతికి గురిచేస్తోందని విమర్శిస్తున్నారు. 

అత్యాచారం వంటి దురదృష్టకర ఘటనలు జరిగితే బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయండి... వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోమ్‌ మంత్రిగా, అందులోనూ మహిళగా ఆమె కోరాలి. అందుకు విరుద్ధంగా అత్యాచారాలపై ఫిర్యాదులు చేసేవారు పరువుగల కుటుంబాలకు చెందినవారు కాదనే అర్థం వచ్చేలా మాట్లాడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)