Breaking News

సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: తానేటి వనిత 

Published on Fri, 05/26/2023 - 18:33

సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వమని, ప్రజలందరికీ సామాజిక న్యాయం చేస్తోన్న సంక్షేమాభివృద్ధి ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శుక్రవారం అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె ఆత్మీయ స్వాగతం పలికారు. సభా కార్యక్రమానికి ముందు సీఎం జగన్‌తో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన విజయవంతం కావడం, సభలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీల గురించి మరోసారి చర్చించి ఆయనకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బుధవారం సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీల పట్ల అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి 24 గంటల్లోనే గురువారం రోజున బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇంత త్వరిత గతిన సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

అలాగే, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి హామీ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్‌కు  హోంమంత్రి వనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఎన్ని మార్పులు.. ఎన్ని సంస్కరణలు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)