Breaking News

మూగజీవాలపై ‘పైసా’చికత్వం

Published on Thu, 02/12/2026 - 05:45

సాక్షి, అనకాపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఆమె పీఏ సుంకర గణేష్‌ ఈ దందా వెనుక కీలకంగా ఉంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెలుగుచూసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో టీడీపీకి చెందిన ముఠా  మూగజీవాలపై ‘పైసా’చికత్వం ప్రదర్శిస్తోందని... ఈ ముఠా రోజు రోజుకూ వికృతరూపం దాలుస్తోందనే ఆరోపణలున్నా యి. జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ సాగుతున్న ఈ దందాపై, గణేష్‌ అవినీతిపై సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోంది. 

గణేష్‌ పై 2022లో కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోంమంత్రి అనిత స్పందిస్తూ పీఏ గణేష్‌ పై విచారణ చేపట్టి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. అయితే ఏ స్టేషన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారో తెలియడం లేదు.గతంలో హోం మంత్రి పాత పీఏ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అప్పట్లో తొలగించారు.

                                              హోంమంత్రి అనితతో పీఏ గణేష్‌  

గోశాల ముసుగులో భారీ దందా 
హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్‌.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వారంతా హోంమంత్రి అనిత పీఏ సుంకర గణేష్‌ అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్‌ నెం.2–8/2 అడ్రస్‌తో ‘రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశారు. 

దానికి అనుబంధంగా విజయవాడలో గల ఏపీ యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా అక్రమమార్గంలో రికగ్నైజేషన్‌ సర్టిఫికెట్‌ పొంది గోశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకుని వసూళ్లకు పాల్పడేవారు. డబ్బులివ్వకుంటే ఆ వాహనాలను పోలీసులకు అప్పగించేలా చేసి... అక్కడి నుంచి ఆ వాహనాల్లోని పశువులను తమ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న గోశాలకు తరలించుకునేవారు. 

అదే సమయంలో ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే పశువులు కొనుగోలు చేసేవారు. అప్పటికే గోశాలలో ఉన్న గోవులతోపాటు తక్కువ ధరకే కొనుగోలు చేసిన పశువులను కలిపి రక్షణ చారిటబుల్‌ ట్రస్టు ముసుగులో హైదరాబాద్‌కు అక్రమంగా తరలించేవారు. 

ఎస్‌.రాయవ రం మండలం పెనుగొల్లులోని చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి పశువులను హైదరాబాద్‌లోని వ్యాపారుల పశువధ శాలలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని... ఈ ముఠాపై విచారణ జరిపి... వారికి జారీ చేసిన సర్టిఫికెట్‌ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌ సిన్హా, లోకాయుక్తకు ఎస్‌.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు ఫిర్యాదు చేశారు. 

ముఠా సభ్యులను, వారికి సహకరిస్తున్న వారి వివరాలు చేర్చి గతేడాది ఆగస్టులో చర్యలు తీసుకోమని కోరినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. అనంతరం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు ‘రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌’ను మాత్రం రద్దు చేశారు.

హైవేపై రయ్‌రయ్‌మని..
అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్థరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్థానికంగా కొందరు హైదరాబాద్‌కు చెందిన పశువధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా కొద్ది రోజుల కిందట కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులతో సమవేశమయ్యేలా అని త పీఏ గణేష్‌ ఏర్పాట్లు చేశాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందరినీ ఓ ముఠాగా ఏర్పాటు చేసి అనకాపల్లి నుంచి హైదరాబాద్‌ వరకూ ఏ అడ్డంకీ లేకుండా పశువుల అక్రమ రవాణాకు గణేష్‌ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశాడని తెలుస్తోంది. 

ఇప్పటికే వ్యాపారులంతా డీసీఎంలు, బొలెరో వాహనాల్లో అత్యంత విచక్షణారహితంగా ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)