Breaking News

అగ్రిగోల్డ్‌ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ

Published on Fri, 03/08/2024 - 04:10

సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్‌ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్‌ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్‌ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్ల­గొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీ­లో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్‌ కంపెనీపై కేసు నమోదైంది.

ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్‌మెంట్‌ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్‌ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్‌ దినకర్‌ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు.

ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్‌ రిజిస్ట్రార్  కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్‌ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్‌ భూములను హస్తగతం చేసుకున్నారు.

అటాచ్‌మెంట్‌కు అనుమతి 
ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్‌ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్‌ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)