Breaking News

ఇది కథ కాదు.. వచ్చినట్టే వచ్చి.. శాశ్వతంగా దూరం

Published on Fri, 09/13/2024 - 06:05

బి.కొత్తకోట: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బిడ్డ.. 14 ఏళ్ల తర్వాత తల్లిండ్రుల వద్దకు చేరాడు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి రెండేళ్ల తరువాత శాశ్వతంగా దూరమయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతులకు ఆకాశ్, అభిలాష్‌ ఇద్దరు కుమారులు. 2008లో పెద్దకొడుకు ఆకాశ్‌ మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. 

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. కాగా.. ఆకాశ్‌ను బెంగళూరులో ఉంటున్న రత్నమ్మ అనే మహిళ పెంచుకుంది. మూడేళ్లు పెంచుకున్నాక ఆమె మదనపల్లె మండలం కొత్తపల్లెలో ఉంటున్న ఆటో డ్రైవర్‌ నాగరాజు, లలితమ్మ దంపతుల వద్దకు ఆకాశ్‌ను పంపించింది. వాళ్లే ఆకాశ్‌ను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత నాగరాజు కుటుంబం నాయనబావికి మకాం మార్చింది. 

ఆ బిడ్డ.. మీ బిడ్డే..  
ఆకాశ్‌ తల్లి రెడ్డెమ్మ చెల్లెలు మంజు బెంగళూరులో ఉంటూ కూలి పనులకు వెళ్తోంది. ఓ రోజు ఆకాశ్‌­ను మూడేళ్ల పాటు పెంచిన రత్నమ్మ, మంజు కూలీ పనుల్లో కలుసుకున్నారు. మూడేళ్ల వయసులో అదృశ్యమైన పిల్లాడు దొరికాడా అని మంజును ఆరా తీసింది. లేదని మంజు చెప్పడంతో రత్నమ్మ అసలు విషయం చెప్పింది. 

నాగరాజు దంపతులు ఆ బిడ్డను తెచ్చి తనకు ఇచ్చారని, మళ్లీ వారికే ఇచ్చి­నట్టు తెలిపింది. ఈ విషయాన్ని మంజు తన అక్క రెడ్డమ్మకు ఫోన్‌ చేసి చెప్పింది. బిడ్డను తెచ్చుకునేందుకు తల్లి రెడ్డెమ్మ ఆటోడ్రైవర్‌ నాగరాజు వద్దకు వెళ్లగా.. ఆకాశ్‌ నీ బిడ్డ అనేందుకు ఆధారమేంటని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. వాడి నాలుకపై పుట్టు మచ్చ ఉంటుందని రెడ్డెమ్మ చెప్పింది.

తల్లి చెప్పిన­ట్టే ఆకాశ్‌ నాలుకపై పుట్టుమచ్చ ఉంది. తల్లి వద్దకు వెళ్లేందుకు మొదట్లో ససేమిరా అన్న ఆకాశ్‌.. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. ఇప్పు­డు ఆకాశ్‌ వయసు 19. ఈ క్రమంలో మంగళవా­రం రాత్రి వినాయక ఉత్సవాల్లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృత్యుఒడికి చేరాడు. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)