Breaking News

హెచ్‌ఐవీ దాచి.. వివాహం చేసుకోబోయిన వరుడు

Published on Thu, 02/27/2025 - 12:36

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో తాళికట్టే సమయానికి ఏపీ ఎన్‌జీవోస్‌(AP NGOs) ప్రతినిధులు వచ్చి మంగళవారం ఓ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ డిస్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్యామ్‌సన్‌ అందించిన వివరాలు.. 2013లో హెచ్‌ఐవీ పాజిటివ్‌(HIV Positive) నిర్ధారణ అయి, ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. 

అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్‌జీవోస్‌(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్‌కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్‌ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు.

 ఏపీఎన్‌జీవోస్‌ అధికారులు మేము బహిరంగం చేయాలను కోవడం లేదని, ఇక్కడ గొడవ చేయవద్దని మా వారు వేడుకుకున్నప్పటికీ వినకుండా వీరిపై దాడి చేశారని హెచ్‌ఐవీ డిస్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ తెలిపారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చారు. మా సిబ్బందిపై దాడిచేసి ఫోన్‌లు లాక్కున్నారని, మా ఎన్‌జీవోస్‌ ఫోన్‌లు ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)