లడ్డూ ఇస్తానని చెప్పి బంధువు అత్యాచారయత్నం

Published on Wed, 11/19/2025 - 09:52

హిందూపురం: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. లడ్డూ ఇస్తానని ఆశ చూపి పసిమొగ్గపై కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు విషయం తెలుసుకుని కామాంధునికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ కాలనీలో చేనేత కార్మికుడు నివాసం ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాల ముగించుకుని పెద్దనాన్న    ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి సొంతింటికి వస్తుండగా వరుసకు తాత అయిన గోపీ అనే 55 ఏళ్ల వ్యక్తి బాలికను పిలిచి.. లడ్డూ ప్రసాదమిస్తానని     ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపు వేసి.. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించబోయాడు. బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. 

అదే సమయంలో ఎవరో బయట నుంచి పిలవడంతో గోపీ తలుపు కొద్దిగా తెరవగానే సందులోంచి బాలిక బయటకు పరుగులు తీసి ఇంటికి చేరుకుంది. తల్లిలేని ఆ బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది. పొరుగింటి మహిళ దగ్గరకు తీసుకుని విషయం ఆరా తీసింది. పాపను సముదాయించి కాలనీవాసులతో కలిసి గోపీ ఇంటికి వెళ్లి నిలదీశారు. స్తంభానికి కట్టేసి చితకబాది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు రాత్రి గోపీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన బాలికను వైద్య పరీక్షలకు పంపాల్సిన పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సీపీఎం, కేవీపీఎస్‌ నాయకులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.  

కామాంధున్ని కఠినంగా శిక్షించాలి 
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.  బాలికకు న్యాయం చేయాలని మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి వీఆర్‌ రాము, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షురాలు జ్యోతమ్మ మాట్లాడుతూ బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు, చికిత్స       అందించడంలో వైద్య సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ మేకు ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందించారు.  


 

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)