Breaking News

వరుణించిన నైరుతి

Published on Mon, 07/01/2024 - 05:05

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్‌ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం.  

సస్యశ్యామల ‘సీమ’ 
నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నా­డు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.

ఆ జిల్లాలో జూన్‌లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది.  

సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. 
కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్‌ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.

జూలైలోనూ సమృద్ధిగా.. 
జూన్‌ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)