Breaking News

ఆర్‌సెట్‌లో ఏ, బీ కేటగిరీలకు సమానంగా సీట్లు

Published on Wed, 01/04/2023 - 05:14

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్‌లో సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. పీహెచ్‌డీ కోర్సుల్లోని సీట్లలో 50 శాతం ఏ–కేటగిరీలో, బీ కేటగిరీలో 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జీవో నంబర్‌–1 విడుదల చేశారు.

పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్లను గతంలో ఆయా యూనివర్సిటీలే నేరుగా నిర్వహించేవి. కానీ గత ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఆర్‌సెట్‌ను నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఏ, బీ కేటగిరీలుగా భర్తీ చేస్తున్నారు.

ఏ–కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్వహించే నెట్, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్స్‌ (సీఎస్‌ఐఆర్‌) యూజీసీ నెట్, ఐఐటీ జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌), రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్టేట్‌ లెవల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సెట్‌) తదితర ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో ఆర్‌సెట్‌లో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తుంటారు.

ఇక బీ–కేటగిరీ సీట్లను ఆర్‌సెట్‌లో మెరిట్‌ సాధించిన పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు కేటాయిస్తుంటారు. గతంలో ఇచ్చిన జీవో నంబర్‌ 45 ప్రకారం ఆర్‌సెట్‌లోని సీట్లలో ఏ–కేటగిరీ అభ్యర్థులతో 25 శాతం సీట్లను, మరో 75శాతం సీట్లను బీ–కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసేవారు.

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన తమకు 25 శాతం సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు విన్నవించడంతో ప్రభుత్వం రెండు కేటగిరీలకు సమానంగా సీట్లు వచ్చేలా 50 శాతం చొప్పున కేటా­యింపు చేసింది. ఈ మేరకు గత జీవోను సవరిస్తూ కొత్తగా జీవో నంబర్‌–1ని విడుదల చేశారు. ఒక కేటగిరీలో మిగిలిన సీట్లను మరో కేటగిరీలోని అభ్య­ర్థుల ద్వారా భర్తీ చేసే వెసులుబాటు కల్పించారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)