Breaking News

‘నైరుతి’ మందగమనం!

Published on Mon, 06/10/2024 - 04:43

సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకింత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవ­నాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి (రిడ్జ్‌) ఏర్పడుతుంటుంది. 

ఇది అల్పపీడన ద్రోణికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు గడియారపు ముల్లు తిరిగే దిశ (క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్‌)లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కార­ణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్‌లో తిరుగు­తాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులేర్పడతాయి. 

ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుకుదనం సంతరించుకోకుండా స్తబ్దుగా ఉన్నాయన్నారు. 

దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయని తెలిపారు. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని.. దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వివరించారు. 

మూడు రోజులపాటు వర్షాలు..
మరోవైపు రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 

అలాగే అల్లూరి, పల్నాడు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)