Breaking News

రాజధాని అమరావతిలో హైకోర్టు పరిస్థితి ఇదీ..

Published on Sun, 09/01/2024 - 04:38

సాక్షి, అమరావతి: రూ.వందల కోట్లు వెచ్చించి కూడా హైకోర్టు తాత్కాలిక భవనాన్ని టీడీపీ హయాంలో ఎంత నాసిరకంగా నిర్మించారో తాజాగా ప్రత్యక్షంగా వెల్లడైంది. శనివా­రం కురిసిన వర్షానికి హైకోర్టులోని పలు కోర్టు హాళ్ల వద్ద భారీగా నీరు చేరింది. అన్నీ ఫ్లోర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లే మార్గం లేక నీరంతా అక్కడే నిలిచిపోయింది. కారి­డార్లలో కూడా నీరు భారీగా నిలిచిపో­యింది. దీంతో కోర్టు సిబ్బంది మోటార్లతో తోడి నీటిని బయటకు పంపేందుకు శ్రమించారు. 

ఇక హైకోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌)­లో పరి­స్థితి చెప్పాల్సిన పనే లేదు. వర్షానికి బార్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో ఫాల్స్‌ సీలింగ్‌ ఊడి­పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపో­వ­డంతో ప్రమాదం తప్పింది. సీలింగ్‌ పైనుంచి నీరు వరదలా లోపలకు చొచ్చుకొచ్చింది. దీంతో ఫైళ్లన్నీ తడిచిపో­వడంతో భద్ర­పరిచేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్చీలను, టేబుళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిపై ఫైళ్లను ఉంచారు.

కొత్త న్యాయవా­దుల నమోదు కార్యక్రమం కూడా ఉండటంతో అవస్థ పడ్డారు. గతంలోనూ న్యాయ­మూర్తులు విధి నిర్వహణలో ఉండగానే కొన్ని చోట్ల ఫాల్స్‌ సీలింగ్‌లు ఊడిప­డ్డాయి. అదృష్టవశాత్తూ సెలవు దినం కావడంతో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవా­దులకు ఇబ్బందులు తప్పాయి. 

రూ.150 కోట్లతో నాసిరకంగా...
తాత్కాలిక హైకోర్టు భవనాన్ని చంద్రబాబు ప్రభుత్వం 2019లో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఒక్కో ఎస్‌ఎఫ్‌­టీకి భారీగా ఖర్చు చేశారు. ఒకపక్క పనులు కొనసాగుతుండగానే నిర్మాణం పూర్తై­ం­దంటూ నాడు సుప్రీంకోర్టుకు అవాస్త­వాలు చెప్పి హైకోర్టును తెలంగాణ నుంచి ఆంధ్ర­ప్రదేశ్‌కు తరలించారు. ఏపీ హైకోర్టు నిర్మా­ణం పూర్తయిపో­యిందని, అన్ని కోర్టు హాలు­లు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పు­దోవ పట్టించారు.

కోర్టు ప్రారంభించిన తరు­వాత హాళ్లను పరిశీలించేందుకు వచ్చిన అప్పటి సీజేకు చేదు అనుభవం ఎదురైంది. ఒకటి రెండు కోర్టు హాళ్లు మాత్రమే సిద్ధం చేసి మిగిలిన వాటిలోకి వెళ్లకుండా పరదాలు కట్టి సీజేను అవమానించింది. అప్పట్లో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఇక హైకోర్టు భవనం లోపల మొత్తం డొల్లే. రాజ«స్థాన్‌ నుంచి తెప్పించిన శాండ్‌ స్టోన్‌ పలకలు హైకోర్టు వెలుపల బిగించారు. కొద్ది నెలలకే అవన్నీ ఊడిపోయాయి.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)